Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూపై చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అని సినీ నిర్మాత SKN ప్రశంస
వార్త వేదిక, సినిమా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని, చట్టం అందరికీ సమానమని పవన్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
Also Read
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “అల్లు అర్జున్ తరఫున రేవతి ఇంటికి పుష్ప టీమ్ వెళ్లి ఉంటే ఇలాంటి రచ్చ జరగదు. చట్టం ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అల్లు అర్జున్‌పై ప్రజల్లో ఉన్న భావనను తప్పుగా చర్చించడమే కాదు, ఒక్కరినే దోషిగా మార్చి విమర్శించడం సరికాదు” అన్నారు.
ఈ వీడియోను కొందరు కట్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత SKN ట్వీట్ చేశారు.
SKN ట్వీట్:
“జరిగిన దురదృష్టకర సంఘటనలో అల్లు అర్జున్ను ఒంటరి చేసి నిందించడం సరికాదు. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి చెప్పిన మాటలు అక్షర సత్యం. కొందరు మాత్రం తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది పుకార్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన పూర్తి క్లిప్‌ను చూడండి,” అంటూ SKN ట్వీట్ చేశారు.
సందర్భం:
సంధ్య థియేటర్ యాక్సిడెంట్ సంఘటనలో అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు వచ్చి వివాదాస్పదం అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనపై ప్రేక్షకులు, సినీ అభిమానులు మద్దతు ఇస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
Pawan Kalyan, Allu Arjun, SKN, Sandhya Theatre Accident, Cine News.
Leave a Comment